షార్ట్‌ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

రాజోళి: వడ్డేపల్లి మండలంలోని జక్కిరెడ్డిపల్లెలో షార్ట్‌ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేష్‌ నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. బుధవారం విద్యుత్‌షార్ట్‌ స ర్క్యూట్‌ కారణంగా పంట పూర్తిగా కాలిపోయింది. అప్పులు తెచ్చి పంట సాగుచేస్తే చివర కు బూడిదే మిగిలిందని రైతు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.

మహిళ మృతి:

కేసు నమోదు

ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్‌ శివారులోని వ్యవసాయ పొలంలో మంగళవారం సాయంత్రం వంగూరు మండలంలోని చాకలిగుడిసెలు గ్రామానికి చెందిన పసుపులేటి మణె మ్మ (42) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. దీంతో బుధవారం మృతురాలి భర్త పసుపులేటి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

చెరువులో

పడి బాలుడి మృతి

దామరగిద్ద: ప్రమాదవశాత్తు చెరువులో పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని నర్సిములు, తిరుపతమ్మ దంపతుల కుమారుడు నర్సింహ (15) రోజులాగే గ్రామ సమీపంలోని చిన్నచెరువు పరిసర ప్రాంతానికి మేకలను మేతకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో చెరువు సమీపంలో మేకలను నిలిపి ఈత పడేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. కానీ నర్సింహకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. గుర్తించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రాజు చొరవతో గజ ఈతగాళ్లు చెరువును గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement