రోడ్లపైనే ఉల్లి విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్లపైనే ఉల్లి విక్రయాలు

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం ఉల్లివేలం నిర్వహించలేదు. దీంతో రైతులు మార్కెట్‌కు ఉల్లిని తీసుకురాకుండ సొంతంగా విక్రయాలు సాగించారు. మార్కెట్‌లో ప్రస్తుతం యాసంగి సీజన్‌ ఽకావడంతో పెద్ద ఎత్తున ధాన్యం అమ్మకానికి వస్తున్నది. మార్కెట్‌లోని రెండు ఆవరణలతోపాటు షెడ్లు ధాన్యం కుప్పలతో నిండిపోతున్నాయి. దీంతో మార్కెట్‌లో ఉల్లిని కుప్పలుగా పోయడానికి స్థలం ఖాలీగా లేకపోవడంతో రైతులు సొంత ట్రాక్టర్‌లపై ఉల్లిబస్తాలతో వచ్చి రోడ్లపైనే నేరుగా విక్రయాలు సాగించారు. కొందరు రైతులు మార్కెట్‌కు ఉల్లిని తెచ్చినా వేలం వేయకపోవడంతో వారు కూడా బయటకు వచ్చి వినియోగదారులకు నేరుగా అమ్ముకున్నారు. ఉదయం 8గంటల నుంచి రైతులు మార్కెట్‌ బయట కోయిల్‌సాగర్‌ రోడ్డుకు రెండు వైపులా వాహనాలను నిలిపి వాటిలో తెచ్చిన ఉల్లిని నేరుగా అమ్మకాలు సాగించారు. నాణ్యమైన ఉల్లిని బస్తాకు రూ.550నుంచి రూ. 500వరకు అమ్మకాలు సాగించడంతో వినియోగదారులు జోరుగా కొనుగోళ్లు సాగించారు.

Advertisement
 
Advertisement
Advertisement