నూతన డీఎఫ్‌ఓగా శివ్‌ ఆశిష్‌ సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నూతన డీఎఫ్‌ఓగా శివ్‌ ఆశిష్‌ సింగ్‌

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: జిల్లా నూతన అటవీ శాఖ అధికారిగా 2018 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు అటవీ శాఖ అధికారిగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్న శివ్‌ ఆశిష్‌ సింగ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

108లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

పాలమూరు: జిల్లాలోని 108 అంబులెన్స్‌లలో మేనేజర్‌, ఈఎంఈ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 విభాగం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్‌(మెకానికల్‌ ఇంజినీరింగ్‌) పూర్తిచేసి ఆటోమొబైల్‌ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 2న జనరల్‌ ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.94912 71103ను సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement