పోషకాల గని కొర్రలు | - | Sakshi
Sakshi News home page

పోషకాల గని కొర్రలు

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

మదనాపురం: ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాల (ముతక ధాన్యాలు) ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ అనిత తెలిపారు. ముఖ్యంగా కొర్రలు వాడటం వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆమె వివరించారు.

అద్భుతమైన పోషక విలువలు

కొర్రల్లో కేవలం పిండి పదార్థాలే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నా యి. ప్రతి 100 గ్రాములకు సుమారుగా 357.44 కిలో కేలరీలు శక్తి, మాంసకృత్తులు (ప్రోటీన్లు) 14.00% పీచు పదార్థం 10.53% కాల్షియం 737.50 మి.గ్రా. ఇనుము 99.30 మి.గ్రా. జింక్‌ 53.60 మి.గ్రా.

ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు

మధుమేహ నియంత్రణ

వ్యాధిగ్రస్తులకు కొర్రలు ఒక వర ప్రసాదం. దీని గ్లైసిమిక్‌ సూచిక తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. వరి బియ్యానికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం.

మెరుగైన గుండె ఆరోగ్యం

కొర్రలు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. రక్తంలోని చక్కెరలను, కొవ్వును నియంత్రించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మెదడు చురుకుదనం

వీటిలో ఉండే అధిక ఇనుము మెదడుకు ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. విటమిన్‌ బీ కాంప్లెక్స్‌ నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

చర్మం, జుట్టు సౌందర్యం

కొర్రల్లో ఉండే కొల్లాజెన్‌ ప్రోటీన్‌ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతూ యవ్వనంగా ఉంచుతుంది. ఇందులోని అధిక ప్రోటీన్‌ కంటెంట్‌ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది.

జీర్ణక్రియకు మేలు

అధిక పీచు ఉండటం వల్ల మలబద్ధకం వంటి జీర్ణకోశ సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఇందులోని ఫినోలిక్‌ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. శరీర దారుఢ్యానికి, కండరాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ దైనందిన ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాలి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.

గుండె వ్యాధులకు చెక్‌

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement