మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర స్థాయి కాన్‌క్లెవ్‌ను నిర్వహిస్తున్నట్లు పీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కాన్‌క్లెవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్న రుగ్మతలు, మూఢనమ్మకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో పలు యూనివర్సిటీలు, కళాశాలల నుంచి ఎన్‌ఎన్‌ఎస్ వలంటీర్లు, ప్రోగ్రాం అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి ఎటువంటి ఫీజులు లేవని, ప్రోగ్రాం అధికారులకు మాత్రం నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపాన్యాసాలు, పోస్టర్ ప్రజెంటేషన్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు పాల్గొంటారని తెలిపారు. ఇటువంటి కాన్‌క్లెవ్‌ను రాష్ట్రంలోనే మొదటి సారిగా నిర్వహిస్తుందన్నందున పెద్ద సంఖ్యలో ఎన్‌ఎస్‌ఎస్ వలింటీర్లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్వో గాలెన్న, ప్రోగ్రాం అధికారులు రవికుమార్, జ్ఙానేశ్వర్, రాఘవేందర్, సుదర్శన్, ఈశ్వర్ తదితరులుపాల్గొన్నారు.


