మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గతనెల 31వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ ఎంపిక ఫలితాలను మంగళవారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు హైదరాబాద్‌లోని హకీంపేట క్రీడా పాఠశాలలో వచ్చేనెల 1వ తేదీన రాష్ట్రస్థాయి సెలక్షన్స్ ఉంటుందని తెలిపారు. ఎంపికై న విద్యార్థులు 10 పాస్ ఫొటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్‌తో హకీంపేట స్పోర్ట్ స్కూల్‌లో ఎంపికలకు హాజరుకావాలని డీవైఎస్‌ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రందించాలని సూచించారు.
ఎంపికై న విద్యార్థులు
బాలురు: ఎం.సాయిచంద్ర (హన్వాడ), జి.గగన్, సమర్థ్ (మహబూబ్‌నగర్ అర్బన్), పాల శివసాయిరెడ్డి (గండీడ్), ఎ.శ్రీవర్ధన్ (హన్వాడ), వి.ధృవన్ (నవాబ్‌పేట), ఎ.అశ్విత్‌రాణసాయి (మహబూబ్‌నగర్ అర్బన్), ఎండీ అవేజ్ (చిన్నచింతకుంట), ఎర్పుల వర్షిత్ (మహబూబ్‌నగర్ రూరల్), హృతిక్ క్రిష్ణ యాదవ్ (హన్వాడ).
బాలికలు: వి.సాయి వైష్ణవి (మహబూబ్‌నగర్ అర్బన్), వి.అఖిరాబాయి(బాలానగర్), కొత్త కీర్తన (అడ్డాకుల), కాట్రావత్ సింధ ు(హన్వాడ), మెగావత్ ఆరాధ్య (కోయిలకొండ), బి.జాహ్నవి (జడ్చర్ల), పానుగంటి తన్మయి (కోయిలకొండ), ఎం.జ్యోతిక శ్రీ (మహబూబ్‌నగర్ అర్బన్), నేనావత్ శైలజ (బాలానగర్), జె.అన్విక (కోయిలకొండ).


