మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల నిరసన

Apr 8 2026 7:44 AM | Updated on Apr 8 2026 7:44 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌స్కూల్‌ వద్ద నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. తమకు గతేడాది మూ ల్యాంకనానికి సంబంధించి డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మరో వారం పదిరోజుల్లో ఈ ఏడాది స్పాట్‌ వ్యాలువేషన్‌ కూడా పూర్తి అవుతుందన్నారు. అలాగే కులగణనకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వాలని కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న ఆర్జేడీ సోమిరెడ్డి అక్కడికి చేరుకొని ఉపాధ్యాయులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం డీఈఓ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్‌ వెంకటేష్‌, రవికుమార్‌, పీఆర్టీయూ మదన్‌మోహన్‌, సుధాకర్‌రెడ్డి, రవీందర్‌గౌడ్‌, ప్రభాకర్‌, మహమూద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement