మహబూబ్‌నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్‌అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళలకు ఆయా అథ్లెటిక్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్‌కుమార్, సునీల్‌కుమార్, శ్రీనివాస్, పీడీలు రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


