ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను సోమవారం రాష్ట్ర బృందం పరిశీలించింది. ప్రోగ్రాం అధికారి మురళి ఎన్‌ఎంఎంఎస్‌లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని మస్టర్ డౌన్‌లోడ్, పని ప్రదేశంలో కూలీల హాజరు, ఫొటో అప్‌లోడ్‌ను స్వయంగా చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంసాన్‌పల్లిలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. వారి వెంట డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


