జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం
హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం..
జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్‌ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
గద్వాల: కృష్ణాబేసిన్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత?
తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన
స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు


