పాలమూరు: వేసవి కాలం నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ చలివేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. తాగునీరు సకాలంలో అందుబాటులో ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, శ్రీదేవి, రాధిక, రాజా రాజేశ్వరి, మమతారెడ్డి, రవిశంకర్, మునవార్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు పాల్గొన్నారు.
●జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సోమవారం కేజీబీవీలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులతో పాటు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. అనంతరం శిశు గృహను సందర్శించి వేసవి నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చిన్నారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశంపై పరిశీలించారు.


