‘కాంగ్రెస్‌ పార్టీలో చేరితే పనులు ఇస్తారంట’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పార్టీలో చేరితే పనులు ఇస్తారంట’

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పనికోసం పోతే కాంగ్రెస్‌ పార్టీలో చేరితేనే పనులు, నిధులు ఇస్తామని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా.. తమ పార్టీ మాట్లాడ లేదన్నారు. ప్రజాతీర్పుకు అనుగుణంగా ముందుకు పోయామన్నారు.మేయర్‌ ఎన్నిక సమయంలో బీఆర్‌ఎస్‌లోకి వస్తామని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక వర్గం చెప్పినా ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఒక మహిళ కార్పొరేటర్‌ భర్తకు ఫోన్‌ చేసి పార్టీలోకి వస్తే ముడా చైర్మన్‌ ఇస్తామని ఆఫర్‌ ఇస్తున్నారని ఆరోపించారు. ముందుగా మీ పార్టీ కోసం కష్టపడిన వారికి, ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేకపోయిన వారికి బీఆర్‌ఎస్‌ నుంచి మీ పార్టీలోకి తీసుకొని టికెట్‌ ఇవ్వలేకపోయినా వారికి నామినేట్‌ పదవులు ఇవ్వాలని సూచించారు. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని మా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారని, పోలీస్‌ శాఖకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొందరు అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. తాము మిగిల్చిన పనులు పూర్తి చేసేందుకు, కొత్త అభివృద్ధి పనులు చేయడానికి సహకరిస్తామన్నారు. మన్యంకొండ రోప్‌వే, మార్కెట్లు, మినీ ట్యాంక్‌బండ్‌, గురుకుల పాఠశాలలు, సూపర్‌ స్పెషలిటీ హాస్పిటల్‌ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తి చేసి రైతులకి సాగునీరు ఇవ్వాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కోసం తాము తెచ్చిన జీఓ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌, కార్పొరేటర్లు నవకాంత్‌, శరత్‌రెడ్డి, ఈశ్వరయ్య, రమేష్‌ నాయక్‌, కిషోర్‌, మధు మోహన్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement