హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ప్రారంభం

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా పరేడ్‌ మైదానంలోని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫూల్‌లో ఆధునిక వాహనాల మరమ్మతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసి టూపోస్ట్‌ హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ను సోమవారం డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీస్‌ విభాగంలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సిద్ధంగా ఉండటం చాలా అవసరమన్నారు. ఈ టూ పోస్ట్‌ హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ వల్ల వాహనాలను సులభంగా పైకి ఎత్తడం, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఫిర్యాదుకు

పరిష్కారం చూపాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రతి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బాధితులకు సత్వరంగా న్యాయం అందించాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో దరఖా స్తు పరిశీలించి ఆయా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్‌శాఖ ముఖ్య బాధ్యత అని తెలిపారు.

● జిల్లా పోలీస్‌శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి పదోన్నతి చిహ్నాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, బాధ్యత కూడా మరింత పెరుగుతుందన్నారు. అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

మార్కెట్‌కుభారీగా ధాన్యం

దేవరకద్ర/జడ్చర్ల: దేవరకద్ర మార్కెట్‌ యార్డు కు యాసంగి సీజన్‌ ధాన్యం రాక ప్రారంభమైంది. సోమవారం మార్కెట్‌కు దాదాపు మూడు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,239, కనిష్టంగా రూ.2,159, హంస గరిష్టంగా రూ.1,779, ఆముదాల ధర గరిష్టంగా రూ.6,163, కనిష్టంగా రూ.6129గా ధరలు నమోదయ్యాయి.

● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.8,032, కనిష్టంగా రూ.5,888 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.7,265, కనిష్టంగా రూ.6,310, ఆముదాలు గరిష్టంగా రూ.6,365, కనిష్టంగా రూ.6,265, జొన్నలు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.2,810, మినుములు రూ.7,010, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,840, కనిష్టంగా రూ.4,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,851, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement