మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మౌలిక సదుపాయాలతోనే నగర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం వీరన్నపేట శివారులోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీ వద్ద యూఐడీఎఫ్‌ నిధులు రూ.1.38 కోట్లతో, భగీరథకాలనీలో రూ.3.60 కోట్లతో, గణేష్‌నగర్‌లోని పార్కు వద్ద రూ.4.21 కోట్లతో, డంపింగ్‌ యార్డు సమీపంలో రూ.1.29 కోట్లతో నిర్మించే ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు బండమీదిపల్లిలో విజయ డెయిరీ ఉత్పత్తుల ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 14 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించనున్నామన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా శుద్ధి చేసిన తాగునీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. విజయ డెయిరీ ద్వారా ప్రజలకు నాణ్యమైన పాలు, ఇతర ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. రైతులకు సరైన ధర లభించేలా, వినియోగదారులకు శుద్ధమైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ రంగం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అనంతరం షాషాబ్‌గుట్ట ప్రాంతంలో పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించారు. ఆయా కార్యక్రమాలలో టీఎస్‌డీడీసీఎఫ్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజుల రెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, శ్రీనివాస్‌యాదవ్‌, సతీష్‌కుమార్‌, మైత్రి యాదయ్యతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement