మెట్టుగడ్డ: మహిళా బిల్లులో బీసీ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ కోరా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గణేషనగర్ కమ్యూనిటీ హాల్‌లో బీసీ కులాల ఐక్యవేదిక మహి ళా విభాగం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బీసీలు రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో చాలా నష్టపోయారని బీసీలు రాజకీయ పార్టీలను నమ్మడం మానేసి బీసీ కులాలంతా ఏకమై ఒక రాజకీయ శక్తిగా మారి రిజర్వేషన్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం ద్వారానే బీసీల ఓట్లు బీసీలు వేస్కోని అధికారం సాధిస్తేనే బీసీల జీవితాలు మారుతాయన్నారు. బీసీల పేరుతో పదవులు పొంది బీసీల సంక్షేమాన్ని మరిచి అగ్రకుల నాయకులకు సేవలు చేస్తూ వత్తాసు పలికే వారిని త్వరలోనే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. బీసీలు రిజర్వేషన్లు కోసం కాదు.. అధికారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని గ్రహించాలని, అధికారమే లక్ష్యంగా బీసీ మహిళలు యువత సిద్ధమవ్వాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో బీసీ మహిళలు విజయలక్ష్మి, రా ణి, రమాదేవి, అంజిలమ్మ, సత్యమ్మ, శోభారాణి, పరమేశ్వరి, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.


