ఆరోగ్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై దృష్టి సారించాలి

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

పాలమూరు: సుశ్రుత ప్రజావైద్యశాల ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం న్యూటౌన్‌లో ఉన్న సుశ్రుత ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 2కే రన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కమెడియన్‌ ఆటో రాంప్రసాద్‌ ప్రారంభించారు. 2కే రన్‌ న్యూటౌన్‌ నుంచి రాజేంద్రనగర్‌, పీడీ నాయుడు చౌరస్తా నుంచి స్టేడియం గ్రౌండ్‌ వరకు కొనసాగింది. అక్కడ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జుంబా డ్యాన్స్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఒత్తిడి జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా నిత్యం వాకింగ్‌, యోగా, ధ్యానం, వ్యాయమం తప్పక చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ మమత, సుశ్రుత ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ ప్రతిభ, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్‌, వైద్యులు శ్యామూల్‌, విజయ్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement