మక్తల్: ప్రపంచంలో స్‌థ్రింగా ఉండేది ధర్మం, కీర్తి మాత్రమేనని నేరడుగోమ్ పీఠాధిపతి సిద్దలింగేశ్వర స్వామి అన్నారు. ఆదివారం జక్లేర్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని కోరారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి.. పుస్తకానికి దగ్గర ఉన్నప్పుడు భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. అనంతరం ఆదిత్య పరాశ్రీ స్వామి మాట్లాడుతూ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని, సమాజం మారినట్లు మనలో మార్పు రావాలని కోరారు. హిందువులందరూ ఐక్యంగా ఉన్నప్నుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, మాతశ్రీ, తదితరులు పాల్గొన్నారు.


