న్యూస్‌రీల్
● ఎట్టకేలకు ఫైనల్‌లొకేషన్ సర్వే పూర్తి
● వనపర్తి, నాగర్‌కర్నూల్,కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మార్గం
● ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,330 కోట్లు
● రైలు మార్గం పొడవు 296 కిలోమీటర్లు
● కీలక అభివృద్ధికి మరో ముందడుగు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పదో తరగతిమూల్యాంకనం ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్‌లో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. బుధవారం హిందీ జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. మొత్తం 1,100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్, పరీక్షల అడిషనల్ కమిషనర్ కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే వారు సెల్‌ఫోన్‌లు ఉపయోగించవద్దని, వ్యాలువేషన్ కోసం డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే పలు పాఠశాలలో సిబ్బందికి అనారోగ్యం, చిన్నపిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో.. వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాల నాయకులు డీఈఓను కోరారు. అలాంటి వారికి మినహాయింపు ఇచ్చి, కొత్త వారికి విధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, తపస్ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్, సురేందర్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన మార్గంలోనే శోభాయాత్ర సాగాలి
మహబూబ్‌నగర్ క్రైం: నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం హనుమాన్ శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీసులు నిర్దేశించిన మార్గంలోనే యాత్ర కొనసాగాలని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పూర్తి సహకారం అందించాలన్నారు. డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడానికి అనుమతి లేదన్నారు. యువత, నిర్వాహకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
● హనుమాన్ జయంతిలో డీజేలు పెట్టరాదని డీజే నిర్వహకులకు వన్‌టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. వన్‌టౌన్ పరిధిలో ఉన్న డీజే సిస్టమ్ నిర్వహకులతో బుధవారం స్టేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం డీజే నిర్వహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
నేడు విద్యుత్ ఆర్టిజన్లవంటావార్పు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, జడ్చర్ల డివిజన్ చైర్మన్ జహంగీర్, మహబూబ్‌నగర్ డివిజన్ చైర్మన్ పెంటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికుడు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పీయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ శ్రీనివాస్ పీయూలో బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మిషన్ లర్నింగ్‌లో మొత్తం 62మంది ఉండగా ఇందులో 34 మంది ఉత్తీర్ణులై, 28మంది ప్రమోట్ అయ్యారు. డేటాసైన్స్‌లో 32 మంది ఉత్తీర్ణులై, 29 మంది ప్రమోట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్‌లో 24 మంది ఉత్తీర్ణులై, 40 మంది ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైలు కనెక్టివిటీబలోపేతం
కనెక్టివిటీల ప్రకారం అలైన్‌మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
200 కిలోమీటర్ల దూరం
ఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్‌కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది.
జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి
జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే శాఖ భావిస్తోంది.
దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలకు దగ్గర అవుతుంది.
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్‌ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్‌లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్‌ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్‌లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్‌ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్‌కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
పరిశ్రమలు, ఉపాధి మెరుగు..
దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ కొత్త లైన్ ద్వారా రాష్ట్రంలోని ఆయా జిల్లాకేంద్రాలతోపాటు హైదరాబాద్, దేశ రాజధానికి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఊతం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
●
బావాజీ ఉత్సవాలు ప్రారంభం
గిరిజనుల ఆరాధ్య దైవం గురు లోకమాసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో ప్రారంభమయ్యాయి.
–8లో u


