● క్వింటా గరిష్టంగా రూ.1400..
కనిష్టంగా రూ.800
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు బుధవారం ఉల్లి కుప్పలతో కళకళలాడింది. వివిధ గ్రామాల రైతులు 10 వేల బస్తాల ఉల్లిని మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ ఆవరణ, సీసీ రహదారులపై ఎక్కడ చూసిన ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి తరలించారు. గత వారం ధరలే ఈసారి కొనసాగాయి. వేలంలో క్వింటా ఽఉల్లి ధర గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.800 పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోలు తూకం చేసి బస్తాలుగా విక్రయించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400గా విక్రయించారు.
● మార్కెట్‌లో మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,358, కనిష్టంగా రూ.2,202, హంస ధాన్యం రూ.1,751, ఆముదాలు గరిష్టంగా రూ.6,202, కనిష్టంగా రూ.6,189 నమోదయ్యాయి.


