రాజాపూర్: జాతీయ రహదారిపై వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో డైవర్షన్‌లను ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి సూచించారు. రాజాపూర్‌లో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను బుధవారం ఎస్పీ పరిశీలించారు. రోడ్డు డైవర్షన్ ఏర్పాటుపై కాంట్రాక్ట్ ప్రతినిధులకు ఆమె పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ అవసరమైన హెచ్చరిక బోర్డులను, రిఫ్లెక్టింగ్ స్టిక్కర్‌లు, సిగ్నల్ లైట్లు, ఇతర సూచికలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా, డైవర్షన్ మార్గాలను, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లైఓవర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వారికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, ఎస్‌ఐ రాజాపూర్ రాజశేఖర్ ఉన్నారు.


