కృష్ణా: భీమానదిౖెవ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం కుసుమర్తి, సూకూర్‌లింగంపల్లిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. దాంతోపాటు కర్ణాటకలోని గూడూర్ బ్రిడ్జి కం బ్యారేజీని కూడా పరిశీలించారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు భీమానదిపై బ్యారేజీ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంత నీటి నిల్వకు అవకాశం ఉండవచ్చు, ఏ ప్రాంతంలో ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయంపై పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎస్‌ఈ శ్రీధర్, కేతన్‌కుమార్, డీఈ శేఖర్, ఏపీపీఈ ప్రదీప్, ఖాజతోపాటూ ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


