అడ్డాకుల: జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద బుధవారం నుంచి నగదు చెల్లింపులకు జాతీయ రహదారుల సంస్థ స్వస్తి పలికింది. టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు ఎక్కువ సేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వాహనదారుడి నుంచి రెండింతల నగదును వసూలు చేసేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుంచి డిజిటల్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతించనున్నారు. ఇందుకోసం 25 శాతం ఫీజును అధికంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాయికల్, శాఖాపూర్, అలంపూర్ టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు ఎన్‌హెచ్‌ఏఐ స్వస్తి పలికింది. ఇక నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించి వెళ్లాలనుకుంటే కుదరదని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఉరేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
హన్వాడ: భార్య మానసిక పరిస్థితి, తనపై కేసుల కా రణంగా జీవితం విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని నాగినోనిపల్లికి చెందిన బొమ్మరాసి నర్సిములు(51) భార్య లక్ష్మమ్మ మానసిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. అలాగే తనపై కేసులు ఉండడంతో ఈనెల 29న ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.


