భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

సిర్సనగండ్లలో స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు

చారకొండ: సిర్సరనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్‌ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా శివదత్తాత్రేయ, పరశరామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రామశర్మ, ఈఓ ఆంజనేయు లు, మేనేజర్‌ నిరంజన్‌, అర్చకులు లక్ష్మణ్‌ శర్మ, మురళీధర్‌ శర్మ, సీతారామశర్మ, కోదండ రామ శర్మ, ప్రవీణ్‌ శర్మ, అనంత శర్మ, భాస్కర్‌ శర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement