అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 824.1 అడుగుల వద్ద 44.0874 టీఎంసీల నీటి నిల్వ ఉంది. టీజీ జెన్‌కో పరిధిలోని భూగర్భ కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 800.0 తగ్గకుండా ఉన్నంత వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అలాగే ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో శ్రీశైలంలో నీటిమట్టం 798.0 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో వేసవిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉండటంతో మంగళవారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేయనున్నట్లు దోమలపెంటకు చెందిన కాంగ్రెస్ నాయకులు మోయిజ్, మల్లిఖార్జున, గురువయ్య, సిరాజ్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఏపీ పరిధిలోని శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుందని, దీంతో ఎంజీకేఎల్‌ఐపై ప్రభావం చూపి ఉమ్మడి జిల్లాకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని చెప్పారు.
ఇసుక డంప్ సీజ్
అయిజ: అనుమతులు లేకుండా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు సోమవారం సీజ్ చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తుంగభద్రానది ఒడ్డున పులికల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 40 ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇసుక డంప్‌ను పరిశీలించి పంచనామా చేశారు. అదేవిధంగా ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ రవినాయక్, జీపీఓ రవి పాల్గొన్నారు.


