పంటలకు నీరందించాలని రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పంటలకు నీరందించాలని రైతుల ఆందోళన

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

చిన్నచింతకుంట: మండలంలోని పర్దీపూర్‌ జలాశయం అడుగంటిపోవడంతో పంటలకు నీరులేక ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాల బ్యాక్‌ వాటర్‌ను విడుదలచేసి, పంటలను కాపాడాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎండిన పంట పొలాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు కోట రాము మాట్లాడుతూ.. పర్దీపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు కష్టించి సాగుచేసిన వరిపైరు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. జూరాల నుంచి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బసిరెడ్డి సంతోష్‌రెడ్డి, స్వామి, నర్సింహ, రఘు, బైని బాలరాజు, బరనప్ప, మల్లేష్‌, గోవిందు, వెంకటేశ్‌, ఆంజనేయులు, బుచ్చప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement