భూత్పూర్: మండలంలోని కొత్తూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (57) అనుమానాస్పద మృతి చెందాడని మృతుడి సోదరుడు లక్ష్మయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలోని ఎల్కిచర్లకు చెందిన అరుణ అలియాస్ మొగులమ్మతో ఆంజనేయులుకు 30 ఏళ్ల క్రింద వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో పెళ్లి అయిన ఐదేళ్ల నుంచే ఆంజనేయులు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఈ నెల 23న సాయంత్రం ఆంజనేయులు పాము కాటు వేయడంతో చనిపోయాడని అతడి సోదరుడైన లక్ష్మయ్యకు అరుణ ఫోన్‌లో సమాచారం ఇచ్చా రు. మరుసటి రోజే అంత్యక్రియలు నిర్వహించగా ఆంజనేయులు శరీరంపై గాయాలు ఉన్న ట్లు గమనించారు. దీంతో మృతుడి తమ్ముడు తన అన్నను చిత్రహింసలు చేసి చంపారని అనుమానం వ్యక్తం చేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిర్వహించి కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
ఖిల్లాఘనపురుం: మిద్దె పైకి ఎక్కుతూ ప్రమావశాత్తు జారిపడిన ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం ఖిల్లాఘనపురానికి చెందిన గంగారపు వెంకటమ్మ (63) శనివారం తెల్లవారు జామున వర్షం పడుతుండగా మిద్దైపెన ఆరబోసిన ఉల్లి విత్తనాలు నానిపోతాయని తీసేందుకు మిద్దె పైకి వెళ్లే క్రమంలో జారి కింద పడిపోయింది. కుటుంబసభ్యులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై మృతురాలి భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.


