ఉపాధి పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులు పూర్తి చేయాలి

Mar 29 2026 8:41 AM | Updated on Mar 29 2026 8:41 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఈ ఆర్థిక సంవ్సరం పూర్తి కావస్తోందని, ఉపాధి హామీ పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. తన చాంబర్‌ నుంచి శనివారం అధికారులతో వెబెక్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. మంజురైన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓలు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

7 లోగా దరఖాస్తు

చేసుకోవాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: తెలంగాణ ఎస్టీ సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌, ఏఐఐఎంఎస్‌ వంటి వాటికి శిక్షణ ఇస్తారని, వచ్చేనెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

వాడీవేడిగా నగర పాలక తొలి సమావేశం

ప్రోటోకాల్‌పై రగడ

వేదికపై మేయర్‌తో పాటు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్‌ఉండటంపై బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన

వార్షిక బడ్జెట్‌ ప్రారంభం కాగానే వాకౌట్‌ చేసిన వైనం

సమావేశపు అజెండాను ఇతర భాషల్లోనూ ముద్రించాలని పట్టుబట్టిన కార్పొరేటర్లు

– వివరాలు IIలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement