మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్షిక (2026–27) బడ్జెట్ మొత్తం రూ.326,60,78,000గా అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల కింద రూ.229.80 కోట్లు రావచ్చని, నికరంగా వివిధ పద్దుల కింద రూ.91,80,78,000 ఆదాయం వస్తుందని లెక్కలుగట్టారు. ఇందులో పన్నుల రాబడి నుంచి రూ.40.85 కోట్లు పన్నేతర రాబడిగా రూ.44.9578 కోట్లు, అసైన్డ్ ఆదాయం నుంచి రూ.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే 2025–26 సంవత్సరానికి మిగులు రూ.3,58,13,000 గా చూపించారు. ఇక వ్యయాలకు సంబంధించి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులకు రూ.7.85 కోట్లు విద్యుత్ బిల్లులకు రూ.6,45,70,000, రుణ వాయిదాల చెల్లింపులకు రూ.1 కోటి, హరితహారం పనులకు రూ.9,18,08,000 వెచ్చించనున్నారు. అలాగే చార్జ్‌డ్ వ్యయాలకు రూ.39,48,78,000, ఇతర నిర్వహణ ఖర్చులకు రూ.25.22 కోట్లు కేటాయించారు. మురికివాడలలో మౌలిక వసతులకు రూ.9,03,33,000, పార్కులు, జిమ్‌లకు, వైకుంఠధామాల అభివృద్ధికి రూ. 1,50,00,000, వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులకు, ఇతర మూలధన వ్యయాలకు రూ.16,56,67,000 కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా 2025–26 సంవత్సరాంతానికి మిగులు రూ.3,58,13,000గా చూపించారు. ఈ పద్దులను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వివరించారు. అనంతరం వీటికి పాలకవర్గం ఆమోదం తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్ రూ.229.80 కోట్లు
2026–27కు నికరంగా రూ.91.80 కోట్లతో అంచనా
ఆమోదించిన మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పాలకవర్గం
2025–26 నాటికి మిగులు రూ.3.58 కోట్లు


