మిడ్జిల్: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేసిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువకుడు అమ్మాయిని పదేళ్ల నుంచి ప్రేమించాడు, చివరకు మాయమాటలు చేసి గర్భవతిని కూడా చేశాడు. ఆ విషయం అమ్మాయి ఇంట్లో తెలువడంతో పెండ్లి చేసుకోవాలని కోరగా, నిరాకరించడంతో శుక్రవారం అమ్మాయి సదరు యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు కూర్చుంది. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. కాగా ప్రేమించిన యు వకుడికి గతంలో పెళ్లి అయి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, అయినా అమ్మాయిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.
కేఎల్‌ఐ కాల్వకు గండి
తిమ్మాజిపేట: మండలంలోని ఆవంచ సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వకు గండి పడడంతో అప్రమత్తమైన రైతులు శుక్రవారం గండి పూడ్చి వేశారు. రైతు గడ్డమోని కృష్ణయ్య పొలం వద్ద కేఎల్‌ఐ కాల్వకు గండి పడి నీరు వృథాగా పోతున్న విషయం గుర్తించిన చుట్టు పక్కల రైతులు జేసీబీ, ట్రాక్టర్లతో కాల్వకు మరమ్మతు చేశారు. కాల్వకు గండి పడితే తక్షణమే స్పందించాల్సి ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సొంత ఖర్చులతో సాగునీరు వృథా కాకుండా కృషి చేశారని వారిని అభినందించారు.
● గర్భవతిని చేసిన యువకుడు
● పెళ్లికి నిరాకరించిన వైనం


