వీరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

వీరుల ప్రాణత్యాగాలు వెలకట్టలేనివి

Mar 28 2026 10:32 AM | Updated on Mar 28 2026 10:32 AM

మక్తల్‌: జాతీయోద్యమ వీరుల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని పీపవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ 95వ వర్ధంతి సందర్భంగా నారాయణపేట క్రాస్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌, ఉద్దమ్‌ సింగ్‌, భట్‌ కేశ్వర్‌, ఆస్సదుల్లకాన్‌, అజాద్‌, చంద్రశేకర్‌ తదితరులు చిత్రపటాలను పీవైఎల్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ దేశ సంపదను స్వదేశ విదేశి కార్పొరేట్‌ పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నాదని ఆగ్రహించారు. దేశంలో పేదలకు ఉచిత విద్యను అందించడంతో పూర్తిగా విఫలమైందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర నాయకులు రామృకష్ణ, చంద్రశేఖర్‌, ఎం, కృష్ణ, బి.రాము, కాళేశ్వర్‌, ఎండీ భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధూ, కాళేశ్శర్‌, భాస్కర్‌, భుట్టో, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement