పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

Mar 25 2026 8:01 AM | Updated on Mar 25 2026 8:01 AM

కృష్ణా: మండలంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి సూపర్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు జెన్‌కో అధికారులు మంగళవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో మక్తల్‌ నియోజకవర్గంలో పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించి, సాధ్యాసాధ్యలపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారన్నారు. దీంతో జెన్‌కో అధికారులు కృష్ణా మండల కేంద్రంతో పాటూ హిందుపూర్‌ శివారులో గతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సేకరించిన భూమిని పరిశీలించారు. వపర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో అధికారులు సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెన్‌కో అధికారులు ఎస్‌ఈ రామకృష్ణారెడ్డి, ఈఈ నవీన్‌, ఏడీ గంగారామ్‌, మంత్రి వాకిటి శ్రీహరి వ్యక్తిగత కార్యదర్శి వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ సోలాపూర్‌ నాగప్ప, రాజప్పగౌడ్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement