మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ పురుషుల ఖోఖో జట్టు మంగళవారం తరలివెళ్లింది. కర్ణాటకలోని దేవాగిరి యూనివర్సిటీలో జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు వీసీ శ్రీనివాస్ ట్రాక్‌షూట్‌లను అందజేశారు. యూనివర్సిటీలో ఉన్న అన్ని క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభకనబరిచి.. పీయూకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీడీ శ్రీనివాస్, కోచ్ వెంకటప్ప, మేనేజర్ కథలప్ప తదితరులు పాల్గొన్నారు.


