పెట్రోల్‌ బాంబ్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బాంబ్‌

Mar 25 2026 7:56 AM | Updated on Mar 25 2026 7:56 AM

బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం

రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లలో వాహనదారుల బారులు

పాలమూరు: నగరంలో పెట్రోల్‌ కొరత ఉందని.. బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారనే ప్రచారంతో వాహనదారులు బంకుల దగ్గర బారులుదీరారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా జిల్లా జైలు పెట్రోల్‌ బంకు దగ్గర ద్విచక్రవాహనాలతోపాటు కార్లు సైతం క్యూ కట్టాయి. ముఖ్యంగా జైలు దగ్గర ఉన్న బంకులో రాత్రి 11 గంటల వరకు వాహనదారులు భారీగా క్యూ కట్టడంతో జైలు సిబ్బంది, వన్‌టౌన్‌ కానిస్టేబుళ్లు వాహనదారులను క్యూలైన్‌లలో ఏర్పాటు చేయించి సమస్య రాకుండా పెట్రోల్‌ వేసుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే హాజ్‌గఫర్‌ పెట్రోల్‌ బంకు దగ్గర వాహనదారులు అధికంగా కనిపించారు. శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీలోనూ పరిస్థితి ఉండటం విశేషం. స్థానికంగా పెట్రోల్‌ కొరత లేదని, సోషల్‌ మీడియాలో ప్రచారం నమ్మరాదని నిర్వాహకులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement