స్థలం, ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేదు. ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ పనులు చేపడితే సంతోషించాం. సొంతిల్లు దక్కుతుందని సంబరపడ్డాం. కానీ, పనులు నిలిచిపోవడంతో ఏళ్లుగా గుడిసెలల్లోనే నివాసం ఉంటున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసి తమకు ఇవ్వాలి.
– గోరిబీ, ఫకీర్‌నగర్, బాదేపల్లి
ఎర్రగుట్టలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీచేశాం. వీరిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. మా దగ్గర ఉన్న దరఖాస్తులను విచారించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల


