సంక్షేమం కోసం కొత్త పథకాలు.. | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం కోసం కొత్త పథకాలు..

Mar 21 2026 6:05 AM | Updated on Mar 21 2026 6:05 AM

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బ్రేక్‌ఫాస్ట్‌ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్‌ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్‌ మోటరైజ్డ్‌ టూ వీలర్‌ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు.

రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement