రాష్ట్ర బడ్జెట్‌లో సామాన్యుల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉంది.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్


