అకాల కష్టాలు మొదలు | - | Sakshi
Sakshi News home page

అకాల కష్టాలు మొదలు

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

అకాల

అకాల కష్టాలు మొదలు

రైతన్నలకు అకాల కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు అకాల వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో విక్రయించడానికి తీసుకొచ్చిన వేరుశనగ తడిసి ముద్దయింది. ఎర్రవల్లి మండలంలో వందలాది ఎకరాల్లో మినుము, పప్పుశనగ, పెసర పంటలు తడిశాయి. కోత కోసి కళ్లాల్లో ఆరబెట్టిన ఎండుమిర్చి తడిసిపోయింది. మానవపాడు మండలంలోనూ మిర్చికి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. గట్టు మండలం పెంచికలపాడులో పొగాకు పంట దెబ్బతింది. ఎర్రవల్లి మండలం వీరాపురంలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అత్యధికంగా జడ్చర్లలో 20.7 మి.మీ., గట్టులో 18.4మి.మీ., హన్వాడలో 16.7 మి.మీ., మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 13.5మి.మీ., చిన్నచింతకుంటలో 12.6, కోయిలకొండలో 10.9 మి.మీ., వర్షపాతం నమోదైంది. ధరూరులో మంగళవారం తెల్లవారుజామున 5గంటల అరగంటపాటు భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి చివర్లోనే మండుతున్న ఎండలకు వర్షం కొంత ఉపశమనం కలిగించినట్లయింది.

– మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం)/గద్వాల (గట్టు)/ఎర్రవల్లి/మానవపాడు/ ధరూరు

ధరూరులో మంగళవారం ఉదయం కురుస్తున్న వర్షం

మహబూబ్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తడిసిన వేరుశనగ బస్తాలు

అకాల కష్టాలు మొదలు 
1
1/4

అకాల కష్టాలు మొదలు

అకాల కష్టాలు మొదలు 
2
2/4

అకాల కష్టాలు మొదలు

అకాల కష్టాలు మొదలు 
3
3/4

అకాల కష్టాలు మొదలు

అకాల కష్టాలు మొదలు 
4
4/4

అకాల కష్టాలు మొదలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement