తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

కేటీదొడ్డి: తల్లి మంద లించిందని మనస్తాపం చెందిన యువకుడు ఉ రేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సో మవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మల్లాపురం గ్రామానికి చెందిన నర్సింహులు, శంకరమ్మ కుమారుడు మహేష్‌(19)ను పనికి వెళ్లలేదని తల్లి మందలించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై మహేష్‌ ఇంట్లో వెంటిలేటర్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుంటలో పడి వ్యక్తి మృతి

బల్మూర్‌: మండల కేంద్రంలో బహిర్భుమికి వెళ్లిన ఓవ్యకి ప్రమావశాత్తు కుంటలో పడి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రేణయ్య(55) గ్రామ సమీపంలోని పురమోనికుంటలోకి బహిర్భుమికి వెళ్లగా.. అక్కడే బోర్లాపడి మృతిచెందాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య చిన్నబాలమ్మ, కుమారుడు, కూతరు ఉన్నారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

బల్మూర్‌: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కుంటలో పడి మృతి చెందిన ఘ టన మండలంలోని న ర్సాయపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ రాజేందర్‌, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లావుడ్యా స్వామి (35) ఈ నెల 22న ఆదివారం గ్రామ సమీపంలోని వావిలాలకుంటలో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం కుంటలో మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు. కాగా మృతుడు భార్య అంకితతో పాటు ఇద్దరు కుమార్తెలతో కొంతకాలం క్రితమే హైదరాబాద్‌కు కూలీ పనులకు వలస వెళ్లాడు. వారం రోజుల క్రితం భార్య, పిల్లలను అక్కడే ఉంచి స్వామి స్వగ్రామానకి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. భార్య పిల్లలు ఇంటి వద్ద లేకపోవడంతో రెండు రోజులైనా అతని ఆచూకీ కోసం ఎవరు ప్రయత్నించకపోవడంతో మంగళవారం కుంటలో శవమై తేలిన తర్వాత తెలిసిందని వారు తెలిపారు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడు మృతి

రాజోళి: గుర్తుతెలియని వాహనం ఢీకొని కోమాలోకి వెళ్లిన యువకుడు నానిగౌడ్‌ (24)చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్డేపల్లి మండలంలోని కొంకలకు చెందిన రామాంజనేయులుగౌడ్‌ కుమారుడు నాని ఆదివారం బైక్‌పై స్వగ్రామం నుంచి శాంతినగర్‌ వైపు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన నాని కోమాలోకి వెళ్లాడు. ఈ క్రమంలో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా.. మంగళవారం మృతి చెందాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండే చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement