రైతులు ఆందోళన చెందొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆందోళన చెందొద్దు

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

రైతుల

రైతులు ఆందోళన చెందొద్దు

లేగదూడలపై దాడి చేసింది

చిరుత కాదు.. నక్కలు

ఫారెస్టు డిప్యూటీ రేంజర్‌ పర్వేజ్‌ అహ్మద్‌

మల్దకల్‌: ఇటీవల మండలంలోని మద్దెలబండ చిన్నతండా, నేతువానిపల్లి సమీపంలోని గుట్టల్లో లేగదూడలపై దాడిచేసి చంపినది చిరుత కాదని, రెండు జంటనక్కలన్నారు. నక్కల దాడితో పశువుల దూడలు మృతిచెందినట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. ఈ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జంట నక్కలు లేగదూడలపై దాడిచేసి వాటిని గుట్టల్లో చంపితిన్నట్లు తెలిపారు. అలాగే మంగళవారం కుర్తిరావులచెర్వు సమీపంలో పటేల్‌ జనార్దన్‌రెడ్డి పొలంలో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించగా చిరుత ఆనవాలు లభించలేదన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు అధికారులు సుమలత, ప్రసూన, రైతులు తదితరులు పాల్గొన్నారు.

చిరుత కాదు.. హైనా!

దేవరకద్ర రూరల్‌: కౌకుంట్ల మండలం పేరూర్‌లో చిరుత సంచరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది చిరుత కాదని, హైనా అని ఫారెస్ట్‌ రేంజ్‌ అఫీసర్‌ వాసు తెలిపారు. మంగళవారం ఉదయం పేరూర్‌ శివారులో చిరుత సంచరించిన గుర్తులు ఉన్నాయని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి జంతువు పాదముద్రను పరిశీలించగా, అవి హైనా అ డుగులుగా గుర్తించారు. హైనాతో మనుషులకుఎలాంటి ప్రాణనష్టం జరగదని మేకలు, గొర్రెల కో సం వస్తుంటదని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారి రాధశ్రీ, రైతులు పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు 1
1/1

రైతులు ఆందోళన చెందొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement