ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం
దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న వేడుకను వేలాదిమంది భక్తులు తిలకించారు. ఉదయం ఆంజన్నకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక కృషి
మహబూబ్‌నగర్ క్రీడలు: క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించిందని, జిల్లాలో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వారణాసిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన జిల్లా ఆర్చరీ క్రీడాకారులు సమీక్ష, శార్వాణి, జి.సమీక్ష, ఆయేషా సిద్ధిఖీ, సాయి మనీశ్వర్, శ్రావణి, కృతిక్ శ్రీవాత్సవ్, స్మృతి సన్నిభాలను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నుంచి దేశస్థాయిలో ప్రతిభ ప్రదర్శించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
పరిశోధనలకు పెద్దపీట వేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఐపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరిశోధన వాతావరణం నెలకొల్పాలని, ఐపీఆర్ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. కీనోట్ స్పీకర్ కేఆర్ పౌల్ మాట్లాడుతూ.. ఐపీఆర్ అనేవి వ్యక్తులు తమ ఆలోచనలను ఉపయోగించి, వస్తువులు ఇతర పరికరాలు తయారుచేస్తే వాటిని హక్కు లు కల్పిచేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ రకాల పేటెంట్లకు విదేశాల్లో చట్టపరమైన భద్రత ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, మధుసూదన్‌రెడ్డి కుమారస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం


