పోలీస్‌శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: క్రమశిక్షణ, నిజాయితీతో పని చేస్తున్న హోంగార్డుల సేవలు పోలీస్‌శాఖలో ఎంతో కీలకమని, జిల్లాలో 208 మంది అంకితభావంతో పని చేస్తున్నారని ఎస్పీ డి.జానకి అన్నారు. 63వ హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరేడ్ మైదానంలో శనివారం ప్రత్యేక కవాతు నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లా డుతూ ట్రాఫిక్ నియంత్రణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, అత్యవసర సమయంలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోంగార్డ్స్ సంక్షేమం, గుర్తింపు ప్రోత్సాహం పెంపొందించడంలో ముందుండి పని చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ హోంగార్డుల ను ఘనంగా సన్మానించారు. అలాగే మృతి చెందిన నలుగురు హోంగార్డ్ కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించారు. ఏడాది కాలంలో ఉత్తమ సేవలు అందించిన 40మంది హోంగార్డ్స్‌కు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, సిబ్బంది పాల్గొన్నారు.


