
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు
రాజ్యాంగబద్ధంగా కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ‘సాక్షి’పై దాడు లు, పోలీసుల బెదిరింపు లు తగవు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు విమర్శ చేసే హక్కు, ప్రజలు, ప్రభుత్వాల కు వారధిగా ఉండేలా రాజ్యాంగం కల్పించిన హక్కు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, సా మాజిక స్పృహ కలిగిన వారు ‘సాక్షి’ పత్రిక, చా నల్‌పై చేస్తున్న కక్ష్యపూరిత చర్యను ఖండించాలి.
– ఎన్.కురుమూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ప్రజలే తిరగబడతారు..
మీడియా గొంతు నొక్కితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. సమాజంలో నాలుగో స్తంభం పత్రిక. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా తమ భావజాలాన్ని ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ హరిస్తోంది. అణచివేతకు గురిచేసిన ప్రభుత్వాలకు గతంలో ఏ గతి పట్టిందో అదేగతి ఈ ప్రభుత్వాలకు పడుతుంది.
– రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి

పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు