
ఎస్పీ పర్యవేక్షణ
మహబూబ్‌నగర్ క్రైం: బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా శనివారం ప్రజా సంఘాలు, పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలపై బందోబస్తును ఎస్పీ జానకి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు ప్రధాన చౌరస్తాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అదనపు బందోబస్తు, రోడ్లపై పెట్రోలింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేశామన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.