
జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి
పాలమూరు: సమాజంలో ఫోర్త్ పిల్లర్‌గా పేరొందిన మీడియాపై కక్ష్యసాధింపు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం అప్రజాస్వామికమని, దుర్మార్గపు చర్య అని మేధావులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఏపీ కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులతోపాటు వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో పలువురు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
బెదిరింపులు సరికాదు..
ప్రజాస్వామ్యంలో అన్ని పత్రికలు సమానమే. ఏ పత్రిక అయినా ప్రజల పక్షానే ప్రశ్నిస్తుంది. అంతే తప్పా ప్రశ్నించే గొంతులకు నొక్కివేసే ప్రయ త్నం చేయకూడదు. నిజంగా తప్పు జరిగి ఉంటే చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలి తప్పా.. బెదిరింపు ధోరణి సరైన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిది.
– భరత్, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి
దాడులను ఖండించాలి..
ప్రజా సమస్యలపై ప్రజా స్వామ్యబద్ధంగా పోరాటం చేసే పత్రికలపై ప్రభుత్వాలు దాడులు చేయడం, కేసులతో నిర్బంధం చేయడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రతిఒక్కరూ పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించాలి.
– బాలకిషన్, సిపిఐ జిల్లా కార్యదర్శి
●

జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం

జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం

జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం