
మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణస్వామి
దేవరకద్ర/అడ్డాకుల: మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తారని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం దేవరకద్ర, అడ్డాకులలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో పాటు మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, టీపీసీసీ పరిశీలకుడు ఉజ్మాషాకీర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు. మెజార్టీ అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ తీసుకునే నిర్ణయం కూడా అభిప్రాయాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీహరి, శెట్టి శేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, బగ్గి కృష్ణయ్య, గోవర్దన్‌రెడ్డి, కతలయ్య, నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, విజయమోహన్‌రెడ్డి, బాలస్వామి, వెంకటేశ్, కిషన్‌రావు, రాంపాండు, ఆదిహన్మంతరెడ్డి, అంజన్‌కుమార్‌రెడ్డి, ఫారూఖ్, కోనరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.