
ఎట్ల జీవనం సాగించాలి..
వారం రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎట్ల జీవనం సాగించాలి. ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడిగినా పైపులైన్లు పగులుతున్నాయని చెబుతున్నారు. వీటికి త్వరగా మరమ్మతులు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు చేయాలి. మా ప్రాంతంలో కొన్ని నెలలుగా ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి రెండు రోజులకోసారైనా క్రమం తప్పకుండా ఇంటింటికీ తాగునీటిని అందించాలి.
– కమల, గృహిణి, క్రిస్టియన్‌కాలనీ, సుభాష్‌నగర్
లీకేజీలను బాగు చేశాం
నగరంలోని రాంరెడ్డిగూడెం వద్ద, ధర్మాపూర్ శివారులో అలాగే ఎన్‌హెచ్–167పై షాషాబ్‌గుట్ట మలుపు వద్ద మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు పది రోజుల వ్యవధిలోనే భారీగా ఏర్పడిన లీకేజీలను బాగు చేయడానికి కొంత సమయం పట్టింది. గురువారం ఉదయం నుంచి తిరిగి తాగునీటి సరఫరాను పునరుద్ధరించగలిగాం. రాంరెడ్డిగూడెం ఫిల్టర్‌బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు విడతల వారీగా తాగునీరు అందుతుంది. ఈ పది రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఆయా ప్రాంతాలకు నిత్యం 20 ట్యాంకర్లను పంపించాం.
– నర్సింహ, ఇన్‌చార్జ్ ఎంఈ, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
తాగునీరు రాక 20 రోజులైంది..
మా తండాలో 60 నుంచి 70 వరకు కుటుంబాలు ఉంటాయి. 20 రోజుల నుంచి మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీరు ఇంటింటికీ అందడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాటర్ ట్యాంకర్లను మా ప్రాంతానికి పంపిస్తే సమస్య కొంత తీరుతుంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– నీలిబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు, పూజారితండా, చిన్నదర్‌పల్లి
●

ఎట్ల జీవనం సాగించాలి..