
ఇసుక డంప్ సీజ్
రాజోళి: మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవె న్యూ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో తని ఖీలు చేపట్టగా గ్రామం నుంచి నౌరోజీ క్యాంపునకు వెళ్లే మార్గంలోని పెద్దవాగు వద్ద 60 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను గుర్తించి సీజ్ చేశామన్నారు. తుంగభద్ర నది నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా అనుమతులు లేకుండా తరలించి డంప్ చేశార్నారు. ఆర్‌ఐ చంద్రకాంత్ ఆధ్వ ర్యంలో తనిఖీ చేసి ఇసుక సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. డంప్ ఎవరు చేశారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు.