
చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎర్రవల్లి: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని జింకలపల్లి స్టేజీ వద్ద శాంతినగర్ జోన్ చెరుకు సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కొత్తకోట మండలంలోని అమడబాకుల రైతువేదికలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణవేణి చెరుకు రైతు సంఘం జనరల్ బాడీ సమావేశం ఉంటుందన్నారు. అందులో చెరుకు రైతుల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం అందరితో చర్చించి పలు నిర్ణయాలతో కూడిన వినతిపత్రాన్ని కృష్ణవేణి చెరుకు పరిశ్రమ యాజమాన్యానికి సంఘం తరఫున అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చెరుకు సంఘం నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, చంద్రసేనారెడ్డి, వెంకటేష్‌గౌడ్, షాలిమియ్య, వీరన్న, వెంకటేష్, రామకృష్ణ, అశోక్‌రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, మదుసూదన్‌రెడ్డి, లక్ష్మన్న తదితరులు ఉన్నారు.

చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి