
జూదానికి బానిసై యువకుడి ఆత్మహత్య
వంగూరు: జూదానికి బానిసై సర్వం కోల్పోయి ది క్కుతోచని స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరా లు.. తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన నవీన్(27) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున శ్రీశైలం క్రాస్‌రోడ్డు వద్దకు ఆటోలో వెళ్లి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పది నెలల బాబు ఉన్నాడు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తెల్కపల్లి మండ లం గడ్డంపల్లికి చెందిన కాకనూరి శ్రీనివాసులు (55) తన బైక్‌పై బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో బంధువుల చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ఉయ్యలవాడ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై కత్తితో దాడి
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎండీ సలీంపై హైదరాబాద్‌కు చెందిన రిషిప్రణయ్, విజయ్ కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అచ్చంపేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో వెల్దండ నుంచి హైదరాబాద్‌కు స్కూటీపై వెళ్తున్న ప్రణయ్, విజయ్ పెద్దాపూర్ సమీపంలో బస్సుకు అడ్డు వచ్చారు. దీంతో డ్రైవర్ వారిని మందలించారు. పెద్దాపూర్ స్టేజీ వద్ద ప్రయాణికులను దించేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. స్కూటీపై ఉన్న ప్రణయ్ తన వద్ద ఉన్న కత్తితో ఆర్టీసీ డ్రైవర్ సలీంపై దాడి చేసి చేతిని గాయపరిచారు. అప్రమత్తమైన ప్రయాణికులు పారిపోతున్న రిషిప్రణయ్, విజయ్‌ను పట్టుకున్నా రు. అనంతరం నిందితులను వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కురుమూర్తి పేర్కొన్నారు.
ఉత్సాహంగా
ఎస్‌జీఎఫ్ ఆర్చరీ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల ఉమ్మడి జిల్లా ఆర్చరీ ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఎంపికలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది బాలురు, 5 మంది బాలికలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్, పీడీలు వేణుగోపాల్, రాంకల్యాణ్‌జీ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ రాఫే సెంచరీ;
పాలమూరు 238 ఆలౌట్
మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ బీ–డివిజన్ టూ డే లీగ్‌లో జిల్లా జట్టు ఓపెనర్ అబ్దుల్ రాఫే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెంచరీ చేశాడు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్–1 క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం మహబూబ్‌నగర్–బాలాజీ కోల్ట్స్ జట్ల మధ్య టూడే లీగ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 76.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా 235 బంతుల్లో 23 ఫోర్లతో 144 పరుగులు చేశాడు. బాలాజీ కోల్ట్స్ బౌలర్లు వివేక్ నందు 4, వి.ఆరుష్ చంద్ర 3 వికెట్లు తీశారు. బుధవారం బాలాజీ కోల్ట్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.

జూదానికి బానిసై యువకుడి ఆత్మహత్య