
అనన్యశ్రీని అభినందించిన సీఎం
మహబూబ్‌నగర్ క్రీడలు: అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న మక్తల్‌కు చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి పి.అనన్యశ్రీని మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీ ఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అనన్యశ్రీ, ఆ మె తల్లిదండ్రులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనన్యశ్రీ సీనియర్ నేషనల్‌లో సాధించిన బంగారు పతకం, ఎఫ్‌ఐఎస్‌యూ వరల్డ్ యూని వర్సిటీ, ఇతర స్థాయిల్లో సాధించిన మెడల్స్‌ను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా అనన్యశ్రీని సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐల య్య, కుంభం అనిల్‌కుమార్‌తోపాటు పి.ఆనంద్, వరలక్ష్మి, ఆదిత్య శౌర్య తదితరులు పాల్గొన్నారు.